![]() |
![]() |
.webp)
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా చిత్ర విచిత్రమైన మలుపులతో సాగుతూ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. నిరంజన్ బీఎస్, డెబ్జాని మోడక్, మిన్ను నైనిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, సుమిత్ర తదితరులు నటించారు.
యష్ బావ లోకేష్ ఎంట్రీతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. రావణుడి లాంటి క్యారెక్టర్ కావడంతో వచ్చి రావడమే వేదపై కన్నేస్తాడు లోకేష్. తనని ఎలాగైనా పట్టుకోవాలని, ముట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటాడు... చివరికి వేద బెడ్రూమ్ లోకి కూడా వెళ్లి తనని అసభ్యంగా తాకాలని చూస్తాడు. ఇదిలా వుంటే వేద తన అమాయకత్వంతో ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటుంది. కాలనీలో ఓ యువతికి పురిటి నొప్పులు రావడంతో తనే డెలివరీ చేయాలని సదరు యువతి తల్లి పట్టుపడుతుంది. ఇదే విషయం ఆఫీస్ లో వున్న యష్ కి చెబితే అనవసరంగా రిస్క్ అవుతుంది అంటాడు.
తేడా వస్తే డాక్టర్ లైసెన్స్ రద్దవుతుందని చెబుతాడు. అయినా సరే వేదని సదరు యువతి తల్లి బలవంతపెట్టడంతో తానే హాస్పిటల్ కి తన కారులోనే తీసుకెళుతుంది. ఈ క్రమంలో కొంతమంది రోడ్డుపైనే ధర్నా చేస్తూ రాస్తా రోకో చేస్తుంటారు. వారితో చర్చించి వేద హాస్పిటల్ కు తీసుకెళ్లాలని అనుకుంటుంది కానీ కుదరకపోవడంతో ఓ తోపుడు బండిపైనే డెలివరీ చేస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది?.. యష్ భయం నిజమైందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |